ఈ ప్రస్తావికను జాగ్రత్తగా చదివి, దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలను సంక్షేపించి వ్రాయండి : (12×5=60)
మనస్సులో దుఃఖము అన్న భావనతో ముడిపడి భయము అన్న భావనకు ఎటువంటి స్థానం ఉన్నదో, ఆనందము అన్న భావనతో జతగూరి ఉత్సాహానికి కూడా అంతే స్థానం ఉన్నది. ఉత్సాహము అంటే కర్తవ్యకర్మల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తమ కర్తవ్యాన్ని సంతోషంగా నెరవేర్చటమని అర్థం. కార్యనిర్వహణలోని కష్టనష్టాల తీవ్రతను బట్టి ఉత్సాహంలోనూ అనేక భేదప్రభేదాలుంటాయి. సాహిత్య విమర్శకులు ఈ ఉత్సాహము అనే స్థాయిభేదాన్ని యుద్ధవీరము, ధర్మవీరము, దయావీరము ఇత్యాదిగా వర్గీకరించారు. వీటిలో అత్యంత ముఖ్యము, అతిపూర్వోక్తము అయిన యుద్ధవీరంలో శరీరం గాయపడటం, తీవ్రమైన బాధకు లోనుకావటం, ఒక్కొక్కప్పుడు మరణోన్ముఖులు కావటం వంటివాటిని లెక్కచేయటం ఉండదు. యుద్ధవీరు లైనవారికి తమ విజయసాధనకై అమితధైర్యము, యుద్ధవిజయం పట్ల తీవ్రాభినివేశము అన్నవి అనాదికాలం నుంచి తప్పనిసరిగా ఉంటున్నాయి. అయితే, కార్యోత్సాహము అంటే వేదనను లేదా బాధను ఓర్చుకొంటూ ధైర్యంగా ముందుకు సాగటం కాదు. లక్ష్యసాధన పట్ల ఎంతో బాధ్యతతో, ఆసక్తితో సంతోషపూర్వకంగా కృషిచేయవలసి ఉంటుంది. శరీరంపై పెద్ద సెగగడ్డను కోస్తున్నప్పుడు స్పృహ కోల్పోకుండా సహింపగలగటం ధీరోదాత్తలక్షణం కావచ్చును కాని, అది యుద్ధాసక్తికి సూచకమని చెప్పలేము. అట్లాగే, బలమైన దెబ్బ తగిలినప్పుడు కాళ్ళూ చేతులూ కదలకుండా, కేకలు వేయకుండా ఓర్చుకోగలగటం ధీరస్వభావం అనిపించుకొంటుంది. ఎంతటి ఆఘాతాన్నైనా వ్యక్తి తట్టుకోగలగటం అతని పట్టుదలకు సూచకం అవుతుంది. అటువంటి మహాధైర్యమూ, పట్టుదల ఉన్నప్పటికీ అతను తన ఉత్సాహాన్ని కోల్పోక లక్ష్యసాధనకై అమితానందంతో ప్రయత్నించటమే కర్తవ్య నిర్వహణలో ఎన్ని దెబ్బలనైనా ఓర్చుకోగల శక్తిని ప్రసాదిస్తుంది. కానున్నది కాక మానదు అనే మొండిధైర్యంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనటంగా కాక దీక్షాదక్షతతో సంతోషపూర్వకంగా కర్తవ్యనిర్వహణకు పూనుకొనటమే నిజమైన యుద్ధోన్ముఖ వీరలక్షణం అనిపించుకొంటుంది.
దానవీరుడు అంటే తన సమస్తైశ్వర్యాన్ని పరిత్యజించేందుకు, ఏతన్మూలాన సంభవించే కష్టనష్టాలను భరించేందుకు ఆవశ్యకమైన ధీరస్వభావాన్ని, అనిర్వేదతను కలిగి ఉండటం. ఒక త్యాగాన్ని చేసిన తర్వాత జీవితంలో తారసిల్లే ఒడిదుడుకుల పట్ల సహిష్ణుతతో వ్యవహరింపగలగటమే త్యాగశీలం. ఈ ఉద్యమంలో ఎన్ని ఆపదలు, క్లేశాలు ఎంతగా ఎదురైతే ఆ త్యాగము అంత గొప్పదని తెలుసుకోవాలి. ఎంతో సంతోషంతో, ఉదారవర్తనతో మనఃస్ఫూర్తిగా త్యాగం చేసేందుకు సోత్సాహంగా, సన్నద్ధంగా ఉండటమే దానవీరం.
యుద్ధంతోపాటు శ్రమైక సాధ్యములైన కఠినకార్యాలు - తీవ్రమైన శరీరాయాసాన్ని కలిగించేవి, మృత్యువుకు సైతం దారితీసేవి అనేకం ఉన్నాయి. మంచుతో కప్పబడి, మబ్బులను చీల్చివేస్తూ అధిరోహణకు దుస్సాధ్యమైన పర్వతాలపై పరిశోధనల నిమిత్తం కృషిచేయటం, ధ్రువప్రాంతాలకు లేదా సహారా ఎడారికి ప్రయాణించటం, ఆచూకీ తెలియని కీకారణ్యాలలో అడుగుపెట్టడం వంటివి కూడా ధైర్యసాహసాలకు నిదర్శకములైన మహాకార్యాలే. ఎంతో సంతోషపూర్వకమైన పర్యుత్సుకతతో వ్యక్తులు ఇటువంటి కార్యకలాపాలను చేపట్టటం కూడా ఈ అభినివేశానికి భౌతిక రూపకల్పనమే.
(a) ఉత్సాహాభివ్యక్తిలో ధైర్యసాహసాల పాత్రను విశదీకరించండి. (12)
(b) ‘పట్టుదల’ అంటే అర్థం ఏమిటి ? (12)
(c) కార్యోత్సాహాన్ని ఏ విధంగా పొందగలము ? (12)
(d) సంతోషపూర్వకమైన ఉత్సుకతా భావం, కార్యోత్సాహాల పరస్పర సంబంధాన్ని వివరించండి. (12)
(e) త్యాగపరుడు తన దానశీలతను ఏ విధంగా సన్నద్ధుడై ఉండాలి ? (12)
60 marks · directive: Comprehension
The core of a good answer
The passage argues that enthusiasm (ఉత్సాహము) is not mere courage in bearing pain: it is carrying out one's duty, or a sacrifice, or a hard enterprise, with responsibility, eagerness and joy, so that courage and perseverance are joined to happiness.
An outline written by upsc.help, not an official UPSC answer; every fact checked by a separate review. How we work
What the question asks
Five questions of 12 marks each, all answerable from the passage. Each answer should be a short paragraph in Telugu, in the candidate's own sentences, built on the passage's own distinctions: courage versus enthusiasm, perseverance (పట్టుదల), the joy that turns effort into enthusiasm, and the giver's cheerful readiness. Nothing from outside the passage is needed.
Answer outline
Introduction
Answer each part separately and briefly, using the passage's key terms (ధైర్యము, పట్టుదల, సంతోషపూర్వకమైన పర్యుత్సుకత, కార్యోత్సాహము, దానవీరము).
(a)
- Enthusiasm means facing the problems met in doing one's duty with courage and fulfilling that duty happily: 'ఉత్సాహము అంటే కర్తవ్యకర్మల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తమ కర్తవ్యాన్ని సంతోషంగా నెరవేర్చటమని అర్థం'.
- Courage is therefore necessary, as in the war hero who does not count wounds, pain or even death ('యుద్ధవీరంలో శరీరం గాయపడటం, తీవ్రమైన బాధకు లోనుకావటం, ఒక్కొక్కప్పుడు మరణోన్ముఖులు కావటం వంటివాటిని లెక్కచేయటం ఉండదు').
- But courage alone is not enthusiasm: 'కార్యోత్సాహము అంటే వేదనను లేదా బాధను ఓర్చుకొంటూ ధైర్యంగా ముందుకు సాగటం కాదు'. Bearing the cutting of a boil without losing consciousness may be a mark of a noble hero, but it does not show eagerness for battle.
- Courage becomes enthusiasm only with joy; the stubborn courage of 'what must happen will happen' ('కానున్నది కాక మానదు అనే మొండిధైర్యం') is not enough.
(b)
- The passage defines perseverance as the ability to withstand any blow: 'ఎంతటి ఆఘాతాన్నైనా వ్యక్తి తట్టుకోగలగటం అతని పట్టుదలకు సూచకం అవుతుంది'.
- It is close to endurance (bearing a strong blow without moving the limbs or crying out is called ధీరస్వభావం), but the passage adds that even with great courage and perseverance one must not lose enthusiasm.
(c)
- By working towards the goal with responsibility, interest and joy: 'లక్ష్యసాధన పట్ల ఎంతో బాధ్యతతో, ఆసక్తితో సంతోషపూర్వకంగా కృషిచేయవలసి ఉంటుంది'.
- By not losing one's enthusiasm and striving for the goal with great joy; this gives the strength to bear any number of blows ('తన ఉత్సాహాన్ని కోల్పోక లక్ష్యసాధనకై అమితానందంతో ప్రయత్నించటమే కర్తవ్య నిర్వహణలో ఎన్ని దెబ్బలనైనా ఓర్చుకోగల శక్తిని ప్రసాదిస్తుంది').
- By taking up one's duty with dedication and skill and with joy, not with stubborn fatalism ('దీక్షాదక్షతతో సంతోషపూర్వకంగా కర్తవ్యనిర్వహణకు పూనుకొనటమే నిజమైన యుద్ధోన్ముఖ వీరలక్షణం').
(d)
- The passage opens by saying enthusiasm is linked with joy, just as fear is linked with sorrow ('ఆనందము అన్న భావనతో జతగూరి ఉత్సాహానికి కూడా అంతే స్థానం ఉన్నది').
- Hard and dangerous tasks (climbing snow-covered mountains for research, travelling to the polar regions or the Sahara, entering unknown dense forests) are great deeds that show courage and daring.
- When people take up such tasks with joyful eagerness, that is the physical form of this zeal: 'ఎంతో సంతోషపూర్వకమైన పర్యుత్సుకతతో వ్యక్తులు ఇటువంటి కార్యకలాపాలను చేపట్టటం కూడా ఈ అభినివేశానికి భౌతిక రూపకల్పనమే'. So joyful eagerness and enthusiasm for work go together; the one is the expression of the other.
(e)
- The giver must have the courage to give up all his wealth and the steadiness (అనిర్వేదత) to bear the hardships that follow ('తన సమస్తైశ్వర్యాన్ని పరిత్యజించేందుకు, ఏతన్మూలాన సంభవించే కష్టనష్టాలను భరించేందుకు ఆవశ్యకమైన ధీరస్వభావాన్ని, అనిర్వేదతను కలిగి ఉండటం').
- After the sacrifice he must face the ups and downs of life with tolerance; the greater the difficulties, the greater the sacrifice.
- Above all he must be ready to give with joy, generosity and a full heart: 'ఎంతో సంతోషంతో, ఉదారవర్తనతో మనఃస్ఫూర్తిగా త్యాగం చేసేందుకు సోత్సాహంగా, సన్నద్ధంగా ఉండటమే దానవీరం'.
Conclusion
Keep each answer to the point; the examiner looks for the passage's distinction between courage that merely endures and enthusiasm that acts with joy.
Facts to remember
- The passage says literary critics classify enthusiasm into kinds such as యుద్ధవీరము (heroism in war), ధర్మవీరము (heroism in righteousness) and దయావీరము (heroism in compassion), and calls war heroism the most important and the earliest mentioned; its second paragraph then describes దానవీరము (heroism in giving).
- Question (e) is printed as 'త్యాగపరుడు తన దానశీలతను ఏ విధంగా సన్నద్ధుడై ఉండాలి ?'; read it as asking how the giver should be prepared in his generosity, which the passage's second paragraph answers.