Pratidin
2026 · Telugu Compulsory Paper (Qualifying) · 60 marksMainsQuestion 3

ఈ క్రింది ప్రస్తావికను మూడవ వంతుకు కుదించి మీ సొంత మాటలలో వ్రాయండి. శీర్షిక అవసరం లేదు. (60)

ఒక మంచి శ్రోతగా ఉండటం ఎటువంటి వారినైనా మంత్రముగ్ధులను కావించే జీవిత నైపుణ్యాలలో ముఖ్యమైన కళ. అయితే ఆ విధంగా ఉండలేకపోవటానికి కారణం మన శక్తిలోపం కాదు - ఆ సంవిధానాన్ని మనకెవరూ నేర్పి ఉండకపోవటం, ఎదుటివారు మన మాటలను శ్రద్ధగా విని ఉండకపోవటం – వంటివి కారణాలవుతాయి. అందువల్ల సంఘజీవిగా మనము మాట్లాడాలన్న తహతహ గాని, ఇతరుల ప్రసంగాలను ఆలకించాలన్న ఆకలి ఉండదు. క్రమేపి అటువంటి స్నేహబంధం అహంకార పూరితమై కొడిగట్టుకుపోతుంది. ఒక శ్రోత మన సన్నిధిలో నిరంతరం ఉండాలనిపించేందుకు అతనికి ఎన్నో సద్గుణాలుండాలి. మనము మాట్లాడేది ఎంతో ఆవశ్యక మనుకొంటూనే, అనిర్వచనీయ వ్యర్థ సంభాషణలతో మనకు తెలియకుండానే కాలయాపన చేస్తుంటాము. ఉద్యోగం చేసే చోట ఆందోళనలు, వృత్తిలో పురోగతి నిమిత్తం ఏమేమి చేయాలనే ఆలోచనలు, మనము చేస్తున్నది మనకు ఉపయోగకరమేనా ? కాదా ? అన్న విచికిత్స, మనము వేస్తున్న తప్పటడుగు ఏమిటన్న ఆలోచన లేకుండానే జీవితం పట్ల నిరుత్సాహాన్ని అలవరచుకోవటం, లేదా దేని గురించో ఉత్తేజితులమై ఉత్సాహం నిండి ఉండటం – వీటిలో కారణం ఇదీ ! అని చెప్పలేని సందిగ్ధావస్థలో ఉంటాము.

నిజానికి ఈ విషయాలన్నీ ఒక్కటొక్కటిగా వివరింప వలసినవే. మంచి శ్రోత ఎప్పుడూ తనకు సందేహావస్థను కలిగించిన ఆందోళన పూరితమైన ఉద్వేగం నుంచి బైటపడి, ఏకాగ్రతను అలవరచుకొని ఒక ప్రశాంతమైన చిత్తస్థితిని పొందుతాడు. అటువంటివారితో వ్యవహారం వల్ల కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. అయితే నిజ జీవితంలో పరస్పర సంభాషణల మూలాన నేర్చుకోవలసిందేమిటో తెలియకపోవటం వల్ల అటువంటి చిత్తస్థితి ఏర్పడదు. మంచి శ్రోతలంటూ ఎంతోమంది ఉండరు. తాము చెప్పటమే గాని విని విశ్లేషిద్దామని ఉండదు. తనను వేధిస్తున్న సమస్యలు, దుఃఖాలను గురించి పరిపరి విధాల చెప్పుకుపోవటమే గాని, అవతలి వ్యక్తి ఏమంటున్నాడు ? మన గురించి మనము తెలుసుకొనేందుకు ఉపకరిస్తున్నాడా ? అని ఆలోచించటం ఉండదు. మంచి శ్రోతలెప్పుడూ ఇటువంటి అవరోధ వ్యూహాలను విజయవంతంగా ఎదుర్కొంటారు.

ఉత్తమ శ్రోత ఇతరులు ప్రసంగిస్తున్నప్పుడు ఉల్లాసంతో గాలిలో తేలిపోతుంటారు. వక్తకు ఉత్సాహ ప్రేరణలను కలిగించే వివిధ భంగిమలతో ఒక్కొక్కప్పుడు సానుభూతిని ప్రదర్శిస్తూ, తల పంకిస్తూ, ఊకొడుతూ తోడ్పడుతారు. ప్రసంగకర్త మరింత లోతుగా చర్చించేందుకు దోహదం చేస్తారు. “ఈ విషయాన్ని గురించి ఇంకా చెప్పండి”, “మీరిలా చెబుతుంటే ఎంత ఆకర్షణీయంగా ఉందో...”, “మీ ఉద్దేశంలో అట్లా ఎందుకు జరిగింది ?”, “ఆ విషయమై మీ ఆంతర్యం ఏమిటి ?” అని ప్రశ్నిస్తుంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎటువంటి వారికైనా కొంత సందిగ్ధత ఉంటుందని శ్రోతకు తెలుసు. అయితే, అవతలి వ్యక్తి మాటను ఖండించకూడదు. అసహనానికి గురికాకూడదు. తొందర పెట్టకూడదు. ఎందుకంటే, వక్తవ్యాంశాన్ని గురించిన అస్పష్టత ఎవరికైనా ఉండవచ్చును. అటువంటి దశలో అవగాహన స్పష్టతకు తోడ్పడటమే నిజమైన స్నేహితుని బాధ్యత. మనము కూడా ఎన్నో మార్లు విషయం చుట్టూ గిరికీలు కొడుతూ మన భయాందోళనలను సూటిగా, అసందిగ్ధంగా చెప్పలేకపోతాము. ఉత్తముడైన శ్రోతకు వక్తయొక్క విపులమైన వివరణ వల్ల మేలు జరుగుతుందని తెలుసు. మరికొంత అడిగితే మరింతగా అర్థమౌతుంది. మన వాక్ప్రవాహానికి అడ్డుపడకుండా, “ఇంకా చెప్పండి” అన్న ప్రేరణ వాక్యంతో మంత్రముగ్ధులను చేసేవారు కావాలి. మనము ఏ తోబుట్టువును గురించో ప్రస్తావిస్తే – అదీ తెలుసుకోవాలనుకొంటారు. “చిన్నప్పుడు మీ ప్రేమాభిమానాలు ఎలా ఉండేవి ? కాలక్రమేణా ఏమేమి మార్పులు వచ్చాయి ? మన సాధకబాధకాలు, ఉత్సవోత్సాహాలు ఏమేమిటి ?” అని తెలుసుకొంటారు. “ఈ విషయమై మీ ఇబ్బందేమిటి ?” అని ఆత్మీయంగా అడుగుతారు. పూర్వాపరాలను దృష్టిలో ఉంచుకొని, వెనుక ఒకప్పుడు మనము చెప్పినదానిని గురించి అడుగుతుంటే – చర్చ మరింత లోతుగా సాగుతున్నదని మనము గ్రహిస్తాము. నిజానికి అస్పష్టంగా భావప్రకటన చేయటం ఎంతో సులభం. ఇది అందంగా ఉన్నది, ఇది భయానకంగా ఉన్నది; ఇది బాగున్నది, బాగాలేదు అని అంటామే కాని, తార్కికతతో అన్వయింపలేకపోతాము. ఉత్తముడైన శ్రోత సృజనశీలతతో మన మాటలలోని పూర్వాపరాలను క్షుణ్ణంగా గ్రహించి, మనస్సు లోతులలోని భావాలను వెలికి తీసికొనివస్తాడు.
(396 పదాలు)

60 marks · directive: Precis

Answer

The core of a good answer

The passage says that being a good listener is a rare and valuable life skill: most of us talk more than we listen and cannot say clearly what troubles us, but a good listener stays calm, encourages and questions the speaker patiently and helps bring out the feelings deep in the mind.

An outline written by upsc.help, not an official UPSC answer; every fact checked by a separate review. How we work

What the question asks

The passage is printed as 396 words, so one-third is 132 words; a precis of about 130 words in Telugu is expected. Read twice, list the main ideas, drop the quoted sample questions and the repetition, and rewrite in your own Telugu sentences, keeping the order of ideas and a consistent point of view. No title is required.

Answer outline

Introduction

Method: note the printed length (396 words), aim for about 132 words, keep the order of ideas, and avoid copying whole sentences from the passage.

Main ideas in order

Conclusion

End the precis with the central point: a good listener helps another person understand his or her own mind.

Facts

Facts to remember

Write a timed answer in the app