ఈ క్రింది తెలుగు వచనాన్ని ఆంగ్లంలోకి అనువదించండి : (20)
ప్రాక్తన కాలంనుంచి భారతీయ నావికులు తమ నౌకాయాన కౌశలానికి పేరెన్నిక గన్నారు. సుమారు ఐదువేల సంవత్సరాల మునుపు వీరు సముద్రయానం మొదలుపెట్టారు. ఆ కాలంలో సముద్రప్రయాణానికి ఉపకరించే సాధనాలు చాలా కొద్దిమాత్రమే ఉండేవి. ఎంతో అభివృద్ధి చెందిన ఈనాటి అత్యాధునిక పరికరాలు అందుబాటులో లేవు. ఏది ఏమైనప్పటికీ ఆ పురాతన కాలపు నావికులకు వాతావరణంలో మార్పులను గురించి గాఢమైన అవగాహన ఉండేది. గ్రహగతులను పరిశీలించి, వాయు గమనాన్ని అర్థం చేసుకొని, నీటి రంగును బట్టి సముద్రపు లోతును గుర్తింపగలిగేవారు. సముద్రగర్భంలోని జీవాల ఉనికిని బట్టి తాము భూతలానికి ఎంత దూరాన ఉన్నదీ, ఒక్కొక్కప్పుడైతే ఏ దేశానికి సమీపంలో ఉన్నదీ నిశ్చయింపగలిగేవారు. ఆ రోజులలో సముద్రయాన శిక్షణ సంస్థలు లేనందున వారు తమ ప్రయత్న సాఫల్య వైఫల్యాల మూలంగానూ, అనుభవం ద్వారానూ నేర్చుకొనేవారు. ప్రమాదాలు జరిగినప్పటికీ ఆత్మవిశ్వాసమూ, ధైర్యమూ వారిని ముందుకు నడిపించేవి. ఆ ప్రోద్బలంతోనే వారు పశ్చిమాన పర్షియన్ సింధుశాఖ (గల్ఫ్) కు, ఆఫ్రికా తూర్పు తీరానికి; ఇండోనేషియా, కాంబోడియా, అన్నామ్ లకు; ఆగ్నేయాన బోర్నియో, సెలబీస్ వంటి సుదూర ప్రాచ్యతీరాలకు చేరగలిగేవారు. 1920 దశకం తొలిరోజులలో ఆధునిక యుగ సముద్రయాన శిక్షణ మొదలయింది.
భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందినప్పటి నుంచి ఒక ఆహ్లాదకరమైన మార్పు కెరటం ఆవరిస్తున్నది. కొన్ని శతాబ్దాల క్రితం ఆవిర్భవించిన సముజ్జ్వలమైన భారతీయ నౌకాయాన సంప్రదాయం వెల్లివిరిసి మళ్ళీ వెలుగొందుతున్నది. భారతీయ నౌకాయానం ఇప్పుడు సవ్యమైన మార్గంలో పురోగమిస్తోంది.
20 marks · directive: Translation (Telugu to English)
The core of a good answer
The passage describes how Indian sailors, from about five thousand years ago, navigated with few instruments but with knowledge of weather, planets, winds, water and sea life, reached lands from the Persian Gulf and East Africa to Borneo and Celebes, and how India's maritime tradition is flourishing again since Independence.
An outline written by upsc.help, not an official UPSC answer; every fact checked by a separate review. How we work
What the question asks
A faithful English translation is needed: past tense for the history, present tense for the last paragraph, as in the original. Render the place names in their standard English forms (Persian Gulf, Africa, Indonesia, Cambodia, Annam, Borneo, Celebes), keep 'five thousand years' and 'the 1920s', and turn compound Sanskrit words (నౌకాయాన కౌశలం, ప్రయత్న సాఫల్య వైఫల్యాలు, సముజ్జ్వలమైన) into plain English.
Answer outline
Introduction
Translate sentence by sentence, then read the English through once for flow.
Faithful translation, sentence by sentence
- Since ancient times, Indian sailors have been renowned for their skill in navigation.
- They began seafaring about five thousand years ago.
- In those days the aids to sea travel were very few.
- The highly developed, ultra-modern instruments of today were not available.
- Nevertheless, the sailors of that ancient period had a deep understanding of changes in the weather.
- By observing the movements of the planets and understanding the movement of the winds, they could tell the depth of the sea from the colour of the water.
- From the presence of creatures in the sea they could determine how far they were from land and, at times, near which country they were.
- As there were no institutions for training in seafaring in those days, they learnt through the success and failure of their own efforts and through experience.
- Even when accidents happened, self-confidence and courage drove them forward.
- With that impetus they were able to reach the Persian Gulf in the west and the east coast of Africa; Indonesia, Cambodia and Annam; and, to the south-east, distant eastern shores such as Borneo and Celebes.
- Modern-era training in seafaring began in the early 1920s.
- Since India attained independence, a pleasant wave of change has been spreading.
- The resplendent Indian maritime tradition that arose some centuries ago is blossoming and shining once again.
- Indian shipping is now advancing on the right course.
Conclusion
Check that every sentence is rendered and that no idea is added; keep the image of the wave of change and the tradition shining again.
Facts to remember
- పర్షియన్ సింధుశాఖ (గల్ఫ్) is the Persian Gulf; సింధుశాఖ literally means an arm of the sea.
- సెలబీస్ is Celebes, also known as Sulawesi, an island of Indonesia; అన్నామ్ is Annam, the historical name of central Vietnam.
- ప్రాచ్యతీరాలు means eastern (oriental) shores; ఆగ్నేయాన means in the south-east.