Pratidin

UPSC Mains Telugu Compulsory Paper (Qualifying) previous-year questions

9 Mains Telugu Compulsory Paper (Qualifying) questions from 2026 to 2026, with the official answer where UPSC has published one, an explanation or answer outline, and the news stories that connect to each. Every question is checked against the published paper.

2026

  1. 2026 · Telugu Compulsory Paper (Qualifying) · 100 marksMains

    ఈ క్రింద ఇచ్చిన ప్రశ్నలలో ఒకదానికి 600 పదాలకు మించకుండా వ్యాసరూప సమాధానం వ్రాయండి : (100) (a) భారతదేశము అన్న భావన : మన భవితవ్యం

  2. 2026 · Telugu Compulsory Paper (Qualifying) · 100 marksMains

    ఈ క్రింద ఇచ్చిన ప్రశ్నలలో ఒకదానికి 600 పదాలకు మించకుండా వ్యాసరూప సమాధానం వ్రాయండి : (100) (b) అంకాత్మక (డిజిటల్) యుగంలో పౌరుల బాధ్యతలు

  3. 2026 · Telugu Compulsory Paper (Qualifying) · 100 marksMains

    ఈ క్రింద ఇచ్చిన ప్రశ్నలలో ఒకదానికి 600 పదాలకు మించకుండా వ్యాసరూప సమాధానం వ్రాయండి : (100) (c) మనదేశంలో అంతరిక్ష పరిశోధన : అంగారక గ్రహకక్ష్యలో ప్రదక్షిణ ప్రయోగం

  4. 2026 · Telugu Compulsory Paper (Qualifying) · 100 marksMains

    ఈ క్రింద ఇచ్చిన ప్రశ్నలలో ఒకదానికి 600 పదాలకు మించకుండా వ్యాసరూప సమాధానం వ్రాయండి : (100) (d) ఆరోగ్యసేవల అందుబాటు - నాణ్యత

  5. 2026 · Telugu Compulsory Paper (Qualifying) · 60 marksMains

    ఈ ప్రస్తావికను జాగ్రత్తగా చదివి, దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలను సంక్షేపించి వ్రాయండి : (12×5=60) మనస్సులో దుఃఖము అన్న భావనతో ముడిపడి భయము అన్న భావనకు ఎటువంటి స్థానం ఉన్నదో, ఆనందము అన్న భావనతో జతగూరి ఉత్సాహానికి కూడా అంతే స్థానం ఉన్నది. ఉత్సాహము అంటే కర్తవ్యకర్మల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తమ కర్తవ్యాన్ని సంతోషంగా నెరవేర్చటమని అర్థం. కార్యనిర్వహణలోని కష్టనష్టాల తీవ్రతను బట్టి ఉత్సాహంలోనూ అనేక భేదప్రభేదాలుంటాయి. సాహిత్య విమర్శకులు ఈ ఉత్సాహము అనే స్థాయిభేదాన్ని యుద్ధవీరము, ధర్మవీరము, దయావీరము ఇత్యాదిగా వర్గీకరించారు. వీటిలో అత్యంత ముఖ్యము, అతిపూర్వోక్తము అయిన యుద్ధవీరంలో శరీరం గాయపడటం, తీవ్రమైన బాధకు లోనుకావటం, ఒక్కొక్కప్పుడు మరణోన్ముఖులు కావటం వంటివాటిని లెక్కచేయటం ఉండదు. యుద్ధవీరు లైనవారికి తమ విజయసాధనకై అమితధైర్యము, యుద్ధవిజయం పట్ల తీవ్రాభినివేశము అన్నవి అనాదికాలం నుంచి తప్పనిసరిగా ఉంటున్నాయి. అయితే, కార్యోత్సాహము అంటే వేదనను లేదా బాధను ఓర్చుకొంటూ ధైర్యంగా ముందుకు సాగటం కాదు. లక్ష్యసాధన పట్ల ఎంతో బాధ్యతతో, ఆసక్తితో సంతోషపూర్వకంగా కృషిచేయవలసి ఉంటుంది. శరీరంపై పెద్ద సెగగడ్డను కోస్తున్నప్పుడు స్పృహ కోల్పోకుండా సహింపగలగటం ధీరోదాత్తలక్షణం కావచ్చును కాని, అది యుద్ధాసక్తికి సూచకమని చెప్పలేము. అట్లాగే, బలమైన దెబ్బ తగిలినప్పుడు కాళ్ళూ చేతులూ కదలకుండా, కేకలు వేయకుండా ఓర్చుకోగలగటం ధీరస్వభావం అనిపించుకొంటుంది. ఎంతటి ఆఘాతాన్నైనా వ్యక్తి తట్టుకోగలగటం అతని పట్టుదలకు సూచకం అవుతుంది. అటువంటి మహాధైర్యమూ, పట్టుదల ఉన్నప్పటికీ అతను తన ఉత్సాహాన్ని కోల్పోక లక్ష్యసాధనకై అమితానందంతో ప్రయత్నించటమే కర్తవ్య నిర్వహణలో ఎన్ని దెబ్బలనైనా ఓర్చుకోగల శక్తిని ప్రసాదిస్తుంది. కానున్నది కాక మానదు అనే మొండిధైర్యంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనటంగా కాక దీక్షాదక్షతతో సంతోషపూర్వకంగా కర్తవ్యనిర్వహణకు పూనుకొనటమే నిజమైన యుద్ధోన్ముఖ వీరలక్షణం అనిపించుకొంటుంది. దానవీరుడు అంటే తన సమస్తైశ్వర్యాన్ని పరిత్యజించేందుకు, ఏతన్మూలాన సంభవించే కష్టనష్టాలను భరించేందుకు ఆవశ్యకమైన ధీరస్వభావాన్ని, అనిర్వేదతను కలిగి ఉండటం. ఒక త్యాగాన్ని చేసిన తర్వాత జీవితంలో తారసిల్లే ఒడిదుడుకుల పట్ల సహిష్ణుతతో వ్యవహరింపగలగటమే త్యాగశీలం. ఈ ఉద్యమంలో ఎన్ని ఆపదలు, క్లేశాలు ఎంతగా ఎదురైతే ఆ త్యాగము అంత గొప్పదని తెలుసుకోవాలి. ఎంతో సంతోషంతో, ఉదారవర్తనతో మనఃస్ఫూర్తిగా త్యాగం చేసేందుకు సోత్సాహంగా, సన్నద్ధంగా ఉండటమే దానవీరం. యుద్ధంతోపాటు శ్రమైక సాధ్యములైన కఠినకార్యాలు - తీవ్రమైన శరీరాయాసాన్ని కలిగించేవి, మృత్యువుకు సైతం దారితీసేవి అనేకం ఉన్నాయి. మంచుతో కప్పబడి, మబ్బులను చీల్చివేస్తూ అధిరోహణకు దుస్సాధ్యమైన పర్వతాలపై పరిశోధనల నిమిత్తం కృషిచేయటం, ధ్రువప్రాంతాలకు లేదా సహారా ఎడారికి ప్రయాణించటం, ఆచూకీ తెలియని కీకారణ్యాలలో అడుగుపెట్టడం వంటివి కూడా ధైర్యసాహసాలకు నిదర్శకములైన మహాకార్యాలే. ఎంతో సంతోషపూర్వకమైన పర్యుత్సుకతతో వ్యక్తులు ఇటువంటి కార్యకలాపాలను చేపట్టటం కూడా ఈ అభినివేశానికి భౌతిక రూపకల్పనమే. (a) ఉత్సాహాభివ్యక్తిలో ధైర్యసాహసాల పాత్రను విశదీకరించండి. (12) (b) ‘పట్టుదల’ అంటే అర్థం ఏమిటి ? (12) (c) కార్యోత్సాహాన్ని ఏ విధంగా పొందగలము ? (12) (d) సంతోషపూర్వకమైన ఉత్సుకతా భావం, కార్యోత్సాహాల పరస్పర సంబంధాన్ని వివరించండి. (12) (e) త్యాగపరుడు తన దానశీలతను ఏ విధంగా సన్నద్ధుడై ఉండాలి ? (12)

  6. 2026 · Telugu Compulsory Paper (Qualifying) · 60 marksMains

    ఈ క్రింది ప్రస్తావికను మూడవ వంతుకు కుదించి మీ సొంత మాటలలో వ్రాయండి. శీర్షిక అవసరం లేదు. (60) ఒక మంచి శ్రోతగా ఉండటం ఎటువంటి వారినైనా మంత్రముగ్ధులను కావించే జీవిత నైపుణ్యాలలో ముఖ్యమైన కళ. అయితే ఆ విధంగా ఉండలేకపోవటానికి కారణం మన శక్తిలోపం కాదు - ఆ సంవిధానాన్ని మనకెవరూ నేర్పి ఉండకపోవటం, ఎదుటివారు మన మాటలను శ్రద్ధగా విని ఉండకపోవటం – వంటివి కారణాలవుతాయి. అందువల్ల సంఘజీవిగా మనము మాట్లాడాలన్న తహతహ గాని, ఇతరుల ప్రసంగాలను ఆలకించాలన్న ఆకలి ఉండదు. క్రమేపి అటువంటి స్నేహబంధం అహంకార పూరితమై కొడిగట్టుకుపోతుంది. ఒక శ్రోత మన సన్నిధిలో నిరంతరం ఉండాలనిపించేందుకు అతనికి ఎన్నో సద్గుణాలుండాలి. మనము మాట్లాడేది ఎంతో ఆవశ్యక మనుకొంటూనే, అనిర్వచనీయ వ్యర్థ సంభాషణలతో మనకు తెలియకుండానే కాలయాపన చేస్తుంటాము. ఉద్యోగం చేసే చోట ఆందోళనలు, వృత్తిలో పురోగతి నిమిత్తం ఏమేమి చేయాలనే ఆలోచనలు, మనము చేస్తున్నది మనకు ఉపయోగకరమేనా ? కాదా ? అన్న విచికిత్స, మనము వేస్తున్న తప్పటడుగు ఏమిటన్న ఆలోచన లేకుండానే జీవితం పట్ల నిరుత్సాహాన్ని అలవరచుకోవటం, లేదా దేని గురించో ఉత్తేజితులమై ఉత్సాహం నిండి ఉండటం – వీటిలో కారణం ఇదీ ! అని చెప్పలేని సందిగ్ధావస్థలో ఉంటాము. నిజానికి ఈ విషయాలన్నీ ఒక్కటొక్కటిగా వివరింప వలసినవే. మంచి శ్రోత ఎప్పుడూ తనకు సందేహావస్థను కలిగించిన ఆందోళన పూరితమైన ఉద్వేగం నుంచి బైటపడి, ఏకాగ్రతను అలవరచుకొని ఒక ప్రశాంతమైన చిత్తస్థితిని పొందుతాడు. అటువంటివారితో వ్యవహారం వల్ల కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. అయితే నిజ జీవితంలో పరస్పర సంభాషణల మూలాన నేర్చుకోవలసిందేమిటో తెలియకపోవటం వల్ల అటువంటి చిత్తస్థితి ఏర్పడదు. మంచి శ్రోతలంటూ ఎంతోమంది ఉండరు. తాము చెప్పటమే గాని విని విశ్లేషిద్దామని ఉండదు. తనను వేధిస్తున్న సమస్యలు, దుఃఖాలను గురించి పరిపరి విధాల చెప్పుకుపోవటమే గాని, అవతలి వ్యక్తి ఏమంటున్నాడు ? మన గురించి మనము తెలుసుకొనేందుకు ఉపకరిస్తున్నాడా ? అని ఆలోచించటం ఉండదు. మంచి శ్రోతలెప్పుడూ ఇటువంటి అవరోధ వ్యూహాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. ఉత్తమ శ్రోత ఇతరులు ప్రసంగిస్తున్నప్పుడు ఉల్లాసంతో గాలిలో తేలిపోతుంటారు. వక్తకు ఉత్సాహ ప్రేరణలను కలిగించే వివిధ భంగిమలతో ఒక్కొక్కప్పుడు సానుభూతిని ప్రదర్శిస్తూ, తల పంకిస్తూ, ఊకొడుతూ తోడ్పడుతారు. ప్రసంగకర్త మరింత లోతుగా చర్చించేందుకు దోహదం చేస్తారు. “ఈ విషయాన్ని గురించి ఇంకా చెప్పండి”, “మీరిలా చెబుతుంటే ఎంత ఆకర్షణీయంగా ఉందో...”, “మీ ఉద్దేశంలో అట్లా ఎందుకు జరిగింది ?”, “ఆ విషయమై మీ ఆంతర్యం ఏమిటి ?” అని ప్రశ్నిస్తుంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎటువంటి వారికైనా కొంత సందిగ్ధత ఉంటుందని శ్రోతకు తెలుసు. అయితే, అవతలి వ్యక్తి మాటను ఖండించకూడదు. అసహనానికి గురికాకూడదు. తొందర పెట్టకూడదు. ఎందుకంటే, వక్తవ్యాంశాన్ని గురించిన అస్పష్టత ఎవరికైనా ఉండవచ్చును. అటువంటి దశలో అవగాహన స్పష్టతకు తోడ్పడటమే నిజమైన స్నేహితుని బాధ్యత. మనము కూడా ఎన్నో మార్లు విషయం చుట్టూ గిరికీలు కొడుతూ మన భయాందోళనలను సూటిగా, అసందిగ్ధంగా చెప్పలేకపోతాము. ఉత్తముడైన శ్రోతకు వక్తయొక్క విపులమైన వివరణ వల్ల మేలు జరుగుతుందని తెలుసు. మరికొంత అడిగితే మరింతగా అర్థమౌతుంది. మన వాక్ప్రవాహానికి అడ్డుపడకుండా, “ఇంకా చెప్పండి” అన్న ప్రేరణ వాక్యంతో మంత్రముగ్ధులను చేసేవారు కావాలి. మనము ఏ తోబుట్టువును గురించో ప్రస్తావిస్తే – అదీ తెలుసుకోవాలనుకొంటారు. “చిన్నప్పుడు మీ ప్రేమాభిమానాలు ఎలా ఉండేవి ? కాలక్రమేణా ఏమేమి మార్పులు వచ్చాయి ? మన సాధకబాధకాలు, ఉత్సవోత్సాహాలు ఏమేమిటి ?” అని తెలుసుకొంటారు. “ఈ విషయమై మీ ఇబ్బందేమిటి ?” అని ఆత్మీయంగా అడుగుతారు. పూర్వాపరాలను దృష్టిలో ఉంచుకొని, వెనుక ఒకప్పుడు మనము చెప్పినదానిని గురించి అడుగుతుంటే – చర్చ మరింత లోతుగా సాగుతున్నదని మనము గ్రహిస్తాము. నిజానికి అస్పష్టంగా భావప్రకటన చేయటం ఎంతో సులభం. ఇది అందంగా ఉన్నది, ఇది భయానకంగా ఉన్నది; ఇది బాగున్నది, బాగాలేదు అని అంటామే కాని, తార్కికతతో అన్వయింపలేకపోతాము. ఉత్తముడైన శ్రోత సృజనశీలతతో మన మాటలలోని పూర్వాపరాలను క్షుణ్ణంగా గ్రహించి, మనస్సు లోతులలోని భావాలను వెలికి తీసికొనివస్తాడు. (396 పదాలు)

  7. 2026 · Telugu Compulsory Paper (Qualifying) · 20 marksMains

    ఈ క్రింది తెలుగు వచనాన్ని ఆంగ్లంలోకి అనువదించండి : (20) ప్రాక్తన కాలంనుంచి భారతీయ నావికులు తమ నౌకాయాన కౌశలానికి పేరెన్నిక గన్నారు. సుమారు ఐదువేల సంవత్సరాల మునుపు వీరు సముద్రయానం మొదలుపెట్టారు. ఆ కాలంలో సముద్రప్రయాణానికి ఉపకరించే సాధనాలు చాలా కొద్దిమాత్రమే ఉండేవి. ఎంతో అభివృద్ధి చెందిన ఈనాటి అత్యాధునిక పరికరాలు అందుబాటులో లేవు. ఏది ఏమైనప్పటికీ ఆ పురాతన కాలపు నావికులకు వాతావరణంలో మార్పులను గురించి గాఢమైన అవగాహన ఉండేది. గ్రహగతులను పరిశీలించి, వాయు గమనాన్ని అర్థం చేసుకొని, నీటి రంగును బట్టి సముద్రపు లోతును గుర్తింపగలిగేవారు. సముద్రగర్భంలోని జీవాల ఉనికిని బట్టి తాము భూతలానికి ఎంత దూరాన ఉన్నదీ, ఒక్కొక్కప్పుడైతే ఏ దేశానికి సమీపంలో ఉన్నదీ నిశ్చయింపగలిగేవారు. ఆ రోజులలో సముద్రయాన శిక్షణ సంస్థలు లేనందున వారు తమ ప్రయత్న సాఫల్య వైఫల్యాల మూలంగానూ, అనుభవం ద్వారానూ నేర్చుకొనేవారు. ప్రమాదాలు జరిగినప్పటికీ ఆత్మవిశ్వాసమూ, ధైర్యమూ వారిని ముందుకు నడిపించేవి. ఆ ప్రోద్బలంతోనే వారు పశ్చిమాన పర్షియన్ సింధుశాఖ (గల్ఫ్) కు, ఆఫ్రికా తూర్పు తీరానికి; ఇండోనేషియా, కాంబోడియా, అన్నామ్ లకు; ఆగ్నేయాన బోర్నియో, సెలబీస్ వంటి సుదూర ప్రాచ్యతీరాలకు చేరగలిగేవారు. 1920 దశకం తొలిరోజులలో ఆధునిక యుగ సముద్రయాన శిక్షణ మొదలయింది. భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందినప్పటి నుంచి ఒక ఆహ్లాదకరమైన మార్పు కెరటం ఆవరిస్తున్నది. కొన్ని శతాబ్దాల క్రితం ఆవిర్భవించిన సముజ్జ్వలమైన భారతీయ నౌకాయాన సంప్రదాయం వెల్లివిరిసి మళ్ళీ వెలుగొందుతున్నది. భారతీయ నౌకాయానం ఇప్పుడు సవ్యమైన మార్గంలో పురోగమిస్తోంది.

  8. 2026 · Telugu Compulsory Paper (Qualifying) · 20 marksMains

    ఈ కింది ఆంగ్లవచనాన్ని తెలుగులోకి అనువదించండి : (20) Orientation for entrepreneurship has to start right from the schools. In schools, teachers need to highlight the role of entrepreneurship in national development. During college, students must be exposed to business development opportunities and must be trained towards the creation of new enterprises. Parents should encourage their children to take up new ventures after their education. We should cultivate a mindset that ‘Idea is wealth’. The government must create a facilitating environment for the provision of venture capital for innovative ideas without collateral security. Universities and engineering and management institutions should work with banks and other funding agencies towards simplifying procedures for setting up businesses and working with entrepreneurs till the project becomes self-sustaining and viable. Procedures in government should facilitate the spotting and recognition of new Indian talent in entrepreneurship by creating a level playing field for healthy competition. Citizens who can afford it should turn themselves into angel investors or start venture capital organizations to fund such new ventures. Big and small industries need to have an open mind in order to encourage and partner with young entrepreneurs.

  9. 2026 · Telugu Compulsory Paper (Qualifying) · 40 marksMains

    (a) ఈ కింది పదాలను సొంత వాక్యాలలో ప్రయోగించండి : (2×5=10) (i) కుందేటి కొమ్ము (2) (ii) జీవగఱ్ఱ (2) (iii) ధర్మవడ్డీ (2) (iv) పుక్కిటి పురాణం (2) (v) పెండ్లి నడక (2) (b) ఈ క్రింది పదాలకు పర్యాయపదాలను వ్రాయండి : (2×5=10) (i) అమృతము (2) (ii) ఎల్లప్పుడు (2) (iii) కుమార్తె (2) (iv) శపథము (2) (v) సరస్వతి (2) (c) ఈ క్రింది పదాలకు వ్యతిరేకార్థక పదాలను వ్రాయండి : (2×5=10) (i) నిరాకారము (2) (ii) విద్య (2) (iii) సదుపదేశము (2) (iv) సూక్ష్మము (2) (v) సౌభాగ్యము (2) (d) ఈ క్రింది పదాలలోని అక్షరదోషాలను సవరించండి : (2×5=10) (i) చైత్ర యాత్ర (2) (ii) జయోపజయాలు (2) (iii) మణస్కారము (2) (iv) శాఖాహారము (2) (v) సోచనీయము (2)